హైదరాబాద్: టి20 మ్యాచ్ టికెట్ల గందరగోళంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తెలంగాణ ప్రతిష్టను దిగజార్చితే సిఎం కెసిఆర్ మండిపడ్డారు. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామన్నారు. టికెట్లు బ్లాక్ లో అమ్మినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పది మంది అనుభవించటం కోసం కాదన్నారు.
ఉప్పల్ స్టేడియం కోసం ప్రభుత్వం 23 ఎకరాలను ఇచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. టికెట్ల విక్రయాలు పారదర్శకంగా జరగాలని మంత్రి తెలిపారు. టికెట్స్ అమ్మకాలపై క్రీడాశాఖ, పోలీస్ శాఖలు నిఘా ఉంచాయన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రేపు ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలిస్తామన్నారు. టికెట్స్ బ్లాక్ దందా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తెలంగాణ పరవు తీస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్టేడియం సామర్థ్యం ఎంత? ఎన్ని టికెట్లు అమ్మారనేదానిపై లెక్కలు తేల్చుతామన్నారు.