Tuesday, January 21, 2025

ఎన్ని కుట్రలు చేసిన బిజెపి గెలవదు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

 

Minister Srinivas goud fires on Bandi Sanjay

నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికల్లో బిజెపి నేతల మాట్లాడుతున్న తీరు సరిగా లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ భవన్ నుంచి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు బిజెపి నేతలు మాయమాటలు చెబుతున్నారని, ఎన్నికల కమిషన్, కేంద్రం తమ చేతుల్లో ఉందని బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అంబానీ ఆదానీ ల డబ్బులతో బిజెపి గెలుద్దామనుకుంటుందని, ఎన్ని కుట్రలు చేసినా బిజెపి గెలిచే ప్రసక్తే లేదన్నారు. ఒక పక్క అంబానీ ఆదానీలు, మరో ప్రక్క ఇడిలతో బిజెపి మునుగోడులో చెలరేగుతుందని దుయ్యబట్టారు.  ప్రజలు మునుగోడులో బిజెపిని ఛీ కొడుతున్నా ఆ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదని, కారును పోలిన గుర్తులు వద్దంటున్నా కేటాయించేలా చేసి బిజెపి తొలి కుట్రకు తెర లేపిందని విమర్శించారు.  తెలంగాణలో మత కల్లోలాలు రేపే కుట్రకు బిజెపి తెర లేపుతోందని, మత ఘర్షణలు రేపి ఓట్లు దండుకోవాలని చూస్తుందన్నారు. బిజెపి కేంద్రంలో చేసింది చెప్పుకోవడం చేతకాకనే సిఎం కెసిఆర్, కెటిఆర్ మీద విమర్శలు చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.

కెసిఆర్ నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్ ను తరిమారని. సొరియాసిస్ లాంటి బిజెపిని కూడా సాగనంపుతామని హెచ్చరించారు.
ధర్మం టిఆర్ఎస్ వైపు ఉందని, ఆ ధర్మం బిజెపి వైపు ఉండడంతో మునుగోడులో ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మోడీ అనగానే మండే ధరలు గుర్తుకు వస్తున్నాయని, గ్యాస్ సిలిండర్, పెరిగిన ధరలను గుర్తుంచుకొని బిజెపి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తమ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయని బిజెపి నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ము బిజెపికి లేదా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బజెపి కుట్రలు చేయడంతోనే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ కు తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముఖ్యమా? మునుగోడు ఉపఎన్నిక ముఖ్యమా? అని ప్రశ్నించారు. అందరూ భారత్ జోడో యాత్రలో ఉంటే మునుగోడులో కాంగ్రెస్ కు పని చేసేదేవరని అడిగారు. ఈ రూపంలో బిజెపికి కాంగ్రెస్ సాయం చేస్తుందని మండిపడ్డారు. బిజెపిని ఓడించే దమ్ము కాంగ్రెస్ కు లేదన్నారు. మునుగోడులో గెలిచిన తర్వాత దేశంలో బిజెపిని ఎదుర్కొనేందుకు కెసిఆర్ బయలు దేరుతారన్నారు. బిసిలకు తెలంగాణ లో జరుగుతున్న మేలు దేశంలో మరెక్కడా జరగడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయవచ్చని, ఎవరు కాదన్నారని, చిరంజీవి పార్టీ గతంలో పోటీ చేయలేదా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మునుగోడులో ప్రజలు టిఆర్ఎస్ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News