Monday, January 20, 2025

బర్మింగ్ హామ్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఘన స్వాగతం…

- Advertisement -
- Advertisement -

Srinivas goud tour in London

ఇంగ్లాండ్: బర్మింగ్ హామ్ విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిమానులు, ఎన్ఆర్ఐలు, టిఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ పట్టణంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ను పరిశీలించడానికి శ్రీనివాస్ గౌడ్ వెళ్లారు.  రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ యువకులు, టిఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన నాయకులు, మంత్రి అభిమానులు బర్మింగ్ హామ్ అంతర్జాతీయ విమానాశ్రయం కు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.  శ్రీనివాస్ గౌడ్ వెంట జాతీయ హాండ్ బాల్ ఫెడరేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లపురం వెంకటేశ్వర రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News