టాక్ లండన్ బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ ఆధ్వర్యంలో
జూలై 3 వ తేదీన లండన్‌లో బోనాలు
మనతెలంగాణ/హైదరాబాద్: లండన్‌లో జూలై 3వ తేదీన నిర్వహిస్తున్న బోనాలకు సంబంధించి ‘లండన్ బోనాల జాతర‘ పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై నాయకులు రాజ్‌కుమార్ శానబోయిన, శ్రీనివాస్ వల్లాల, ప్రమోద్ కక్కెర్లలు ఉన్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. పోస్టర్ ఆవిష్కరించడమే కాకుండా అన్ని వేళలా టాక్ సంస్థను ప్రోత్సహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాగే సంస్థ ఆవిర్భావం నుంచి తమ ప్రయాణంలో అడుగడుగునా తమవెంట ఉండి ముందుకు నడిపిస్తున్న కవితను మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్‌కు రత్నాకర్ కడుదుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Srinivas Goud Unveils Tauk London Bonala Jatara Poster