హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డొంక కదులుతోంది. హైదరాబాద్ కేంద్రంగా సోదాలు కొనసాగుతున్నాయి. ముడుపుల విషయంలో ఇడి లోతుగా దర్యాప్తు చేస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ కంపెనీల నుంచి భారీగా ముడుపులు అందినట్టు గుర్తించారు. శ్రీనివాసు రావుకు చెందిన పలు కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్యంగా శ్రీనివాసరావు పేరు తెరమీదికి వచ్చింది. సిఎ బుచ్చిబాబు ఇంట్లో సోదాల తరువాత శ్రీనివాసరావుపై పోకస్ చేశారు.
బుచ్చిబాబు ఇంట్లో లభించిన హార్ట్ డిస్క్‌లో కీలక సమాచారం దొరికింది. శ్రీనివాసరావు ద్వారానే కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగాయి. కంపెనీల ఏర్పాటుకు సంబంధిచి డాక్యుమెంట్లు స్వాధీనంచేసుకున్నారు. పలు ఒప్పంద పత్రాలను క్షుణ్ణంగా ఇడి పరిశీలిస్తుంది. సిగ్నల్ యాప్ ద్వారా మధ్య సంభాషణలు జరిగాయి. శ్రీనివాసరావు, పిళ్లైల నుంచి కీలక సమాచారం సేకరించారు. ఇడి అధికారుల సోదాల్లో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్‌రావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు బయటపడ్డాయి. శ్రీనివాస్ రావు చేసిన కోట్ల లావాదేవీలపై ఇడి ప్రశ్నించనుంది. లిక్కర్ టెండర్లకా లేదా మరో దానికా అనే కోణంలో ఇడి దర్యాప్తు చేస్తోంది. ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో కీలక ఆధారం లభ్యమైంది. 18 జోన్లకు సంబంధించి 9 లిక్కర్ కంపెనీలకు హైదరాబాద్ వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నట్టు గుర్తించారు.