Sunday, December 22, 2024

కోమలమ్మ సత్రంలోకి  శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: శ్వేత భవనంలోని టీటీడీ శ్రీనివాస  కల్యాణం , వైభోత్సవాల ప్రాజెక్ట్ కార్యాలయాన్ని కోమలమ్మ సత్రం ప్రాంగణంలోకి మార్చారు.  బుధవారం  జేఈవో  సదాభార్గవి కోమలమ్మ సత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు శాస్రోక్తంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి సూచనల మేరకు 1.5 ఎకరాల విస్తీర్ణంలోని  కోమలమ్మ సత్రం లో  ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు శ్రీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ లోని స్వామి అమ్మవార్ల విగ్రహాలను ఇక్కడ ఉంచి నిత్య పూజ, కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నిర్వహించే శ్రీవారి కల్యాణం , వైభోత్సవాలకు ఇక్కడి నుండే ఉత్సవర్లను తీసుకు వెళ్ళనున్నట్లు చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థం రోజున శ్రీవారి ఆలయం నుండి అమ్మవారికి తీసుకువచ్చే సారెను  కోమలమ్మ సత్రంలో ఉంచి పూజలు నిర్వహిస్తారన్నారు.

దాస సాహిత్య  ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్ ల ద్వారా ఈ సత్రంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత,  ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఈవో  వివరించారు.  భక్తులు ఈ ప్రాంగణంలో పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.

ఈ పూజా కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థా చార్యులు, విజివో మనోహర్, డిపిపి ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజగోపాల రావు, డిపిపి కార్యదర్శి  డాక్టర్  శ్రీనివాసులు, శ్వేత డైరెక్టర్ ప్రశాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News