- Advertisement -
పెద్దపల్లి: తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో శ్రీ పాద ఎల్లంపల్లి జలాశయం నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం సామర్థ్యం 20.175 టిఎంసిలుగా ఉంది. 16.8164 టిఎంసిల నీరు ప్రస్తుత నిల్వ ఉంది. ఈ జలాశయానికి ఇన్ ఫ్లో 8,89,692 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 9,17,748 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన 48 గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read: రూ. 1.5 కోట్ల ల్యాండ్ రోవర్‌లో బాబా రాందేవ్ షికార్లు(వైరల్ వీడియో)
- Advertisement -