- Advertisement -
నల్గొండ: తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్‌హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ లెక్కింపులో పిఆర్‌టియు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. శ్రీపాల్ రెడ్డికి 6035 ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో 4820 ఓట్లతో యుటిఎఫ్ అభ్యర్థి సర్సిరెడ్డి., 4437 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్థన్, 3115 ఓవర్లలో మరో స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్, 2289 ఓట్లతో బిజెపి అభ్యర్థి సర్వోత్తం రెడ్డి, 2040 ఓట్లతో సుందర్ రాజ్ యాదవ్ ఉన్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో చెల్లుబాటు అయిన ఓట్లు 23,641 కాగా చెల్లని ఓట్లు 494. కాగా ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 11,822 ఓట్లు.
- Advertisement -