Sunday, December 22, 2024

తెప్పపై శ్రీపార్థసారథిస్వామివారి విహారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం 9.45 నుండి 10.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.

అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా సోమవారం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి,ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునిక్రిష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News