Friday, November 22, 2024

అది పాత రిపోర్ట్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 2022లో అధికారంలో ఉన్నదేవరు? ప్రజలను పక్కదోవ పట్టించవద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సమాచారశాఖ డైరెక్టర్ (మీడియా అండ్ కమ్యూనికేషన్స్) కర్రి శ్రీరామ్ ఘాటుగా స్పందించారు. సీఎంరేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో (ఇడిబి) ర్యాంకింగ్ పడిపోయిందని విమర్శిస్తూ కేటీఆర్ చేసిన ట్విట్‌ను పేపర్ క్లిపింగ్‌తో ట్యాగ్ చేస్తూ కర్రి శ్రీరామ్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. కేటీఆర్ పేర్కొన్న ఇడిబి ర్యాకింగ్‌లు 2024 సంవత్సరానికి సంబంధించినవి కావని,

2024 పూర్తి కాకుండానే ర్యాంకింగ్‌లు ఎలా వస్తాయని శ్రీరామ్ ప్రశ్నించారు. కేటీఆర్ పేర్కొన్న ఇడిబి ర్యాంకింగ్‌లు 2022 సంవత్సరానికి చెందినవని, అప్పుడు 2022లో ముఖ్యమంత్రి ఎవరు?, అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి ఎవరని శ్రీరామ్ సూటీగా ప్రశ్నించారు. ఇడిబిలో మరి అంతటి అధ్వన్నమైన పనితీరు ఎందుకు కనబరిచారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టినందుకు కేటీఆర్‌కు థ్యాంక్స్ అని కర్రి శ్రీరామ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
—౦౦౦౦౦౦

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News