- Advertisement -
గమెండోరా: శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రభావం తగ్గడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 90 టిఎంసిలు ఉండగా శుక్రవారం సాయంత్రం వరకు 1090.90 అడుగులు 89.763 టిఎంసిలుగా ఉందని ప్రాజెక్టు ఏఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలు కాకతీయకు 2500 క్యూసెక్యులు, వరద కాలువకు 3000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 200 క్కూసెక్యులు, సరస్వతీ కాలువకు 100 క్యూసెక్కులు, మంచినీటి అవసరాలకు, ఆవిరి రూపంలో 780 క్యూసెక్కుల నీరువిడుదల చేస్తున్నామన్నారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు 90.313 టిఎంసిలుగా ఉందని అధికారులు తెలిపారు.
- Advertisement -