Monday, December 23, 2024

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌లోకి 51 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

- Advertisement -
- Advertisement -

మెండోరా : శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 51వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నాలుగు వరద గేట్ల ద్వారా 12480 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టిఎంసిలు ఉండగా సోమవారం మధ్యాహ్నం వరకు 1090.90 అడుగులు 89.763 టిఎంసిలుగా ఉందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఆయకట్టు పంటల సాగుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువలు కాకతీయ కాలువ ద్వారా 3000 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు,

ఎస్కేప్ గేట్ల ద్వారా 5000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మంచినీటి అవసరాలకు, ఆవిరి రూపంలో 780 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. మొత్తం కలిపి 26560 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి విడుదల అవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1090.40 అడుగులు 87.011 టిఎంసిలుగా ఉందని అన్నారు. ఒకటి జూన్ నుండి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 124.730 టిఎంసిల నీరు వచ్చి చేరిందని, ఒకటి జూన్ నుండి ఇప్పటి వరకు 56.355 టిఎంసిల నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News