Monday, December 23, 2024

శ్రీరామ్‌నగర్‌కాలనీ ఏబ్లాక్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా : గాంధీ

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: ప్రజా సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీ ఏబ్లాక్‌లో 7లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే యుజిడి నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి, కాలనీల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

శ్రీరామ్‌నగర్ కాలనీ ఏబ్లాక్‌కు మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీరామ్‌నగర్ కాలనీ ఏబ్లాక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుందన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఉన్న డ్రైనేజీ సమస్యకు నేటితో తిరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సందీప్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, షేక్ చాంద్‌పాషా, కాలనీ అధ్యక్షులు బలరాం యాదవ్, వెంకట్‌రెడ్డి, తిరుపతియాదవ్, ప్రసాద్, మల్లేష్, రమణ, నరసింహరెడ్డి, గౌస్‌పటేల్, రామరాజు, జైపాల్‌రెడ్డి, రమేష్ యా దవ్, నరసింహులు, హనుమంతురెడ్డి, ధనుంజయరావు, సోమయ్య, ప్రసాద్, రత్నం, వెంకటేష్, నాగరాజు, కేదార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News