కర్నూల్: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ జూరాల ప్రాజెక్టు నుంచి 86 వేల క్యూసెక్కుల నీరు స్పిల్ వై ద్వారా వదులుతున్నారు. అదేవిధంగా మరో 40 వేల క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తి ద్వారా వదులుతున్నారు. అదేవిధంగా తుంగభద్రా నదికి వరద పెరగడంతో దుంకేసుల ప్రాజెక్ట్ ద్వారా 76 వేల క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలంకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1071లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1.85 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు కాగా, ప్రస్తుతం 884.80అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
Srisailam Dam 4 Gates Opened