- Advertisement -
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి కారణంగా శ్రీశైలం మల్లన్న దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో పొందేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఇవొ లవన్న ఆదివారం నాడు ఒక ప్రటకనలో తెలిపారు. భక్తులు మంగళవారం నుంచి దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో శ్రీశైలంలో ఆన్‌లైన్ టికెట్ల విధానం అమలుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈక్రమంలో ఉచిత దర్శనం, రూ.150, రూ.300 టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లు పొందవచ్చని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ధ్రువపత్రం ఆన్‌లైన్‌లో సమర్పించాలని స్పష్టం ఇవొ లవన్న స్పష్టం చేశారు.
- Advertisement -