Wednesday, January 22, 2025

శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. 10 గేట్లు ఓపెన్

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులు.. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 4,50,064 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 5,22,318 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 882.20 అడుగులకు చేరుకుంది. ఇక, పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 200.1971 టీఎంసీలుగా ఉంది. మరవైపు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News