Monday, January 20, 2025

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Srisailam Project Receives Flood water inflow

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి 2.71 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, స్పిల్‌వే ద్వారా 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత 884.70 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టిఎంసిలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 213.88 టిఎంసిలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Srisailam Project Receives Flood water inflow
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News