Sunday, December 29, 2024

శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఓపెన్..

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో జలాశయం 4 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. కాగా, ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1,60,146 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,77,040 క్యూసెక్కులుగా ఉంది. ఇక, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News