శ్రీశైలంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల వల్ల ఆలయానికి భారీ ఎత్తున ఆదాయం వచ్చి చేరింది. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.3.57 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు ప్రకటించారు. 103 గ్రాములు బంగారం, 7.520 కిలోల వెండి ఆభరణాలు, 243 అమెరికా డాలర్లు, 220 యూఏఈ ధీర్హములు, 61 సింగపూర్ డాలర్లు, 175 ఆస్ట్రేలియ డాలర్లు, 20 కెనడా డాలర్లు, 150 యూరోలు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు తదితర విదేశీ కరెన్సీ సైతం భక్తులు మొక్కుల రూపంలో స్వామి, అమ్మవార్లకు హుండీలో సమర్పించారు.
ఏడు రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు ప్రతిరోజు విశేష పూజలు అందుకున్నారు. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతి పూజ, పుణ్యావహవచనం, చండీశ్వరపూజ , ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగింపు అనంతరం పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలతో సంకాంత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ఆలయ ఈవో తెలిపారు