హైదరాబాద్: సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కోలుకున్నాడు. దీంతో ఈరోజు అతన్ని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. గతేడాది డిసెంబర్ 4వ తేదీన హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. సినిమా చూసేందుకు తన తల్లిదండ్రులతో కలిసి శ్రీతేజ్ సంధ్య థియటర్ కు వచ్చాడు. ఈ ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా.. అతని తల్లి రేవంత్ మృతి చెందింది. దీంతో పోలీసులు సంథ్య థియేటర్ ఓనర్ పై, హీరో అల్లుఅర్జున్ పై కేసు నమోదు చేశారు. బన్నీని అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బన్నీ ఇంటిపై కూడా కొందరు దాడికి పాల్పడ్డారు. మరోవైపు, చావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అల్లుఅరక్జున్, డైరెక్టర్ సుకుమార్, పుష్ప టీమ్ ఆస్పత్రికి వెళ్లి..శ్రీతేజ్ వైద్యం ఖర్ఛులతోపాటు రూ. 2 కోట్లు ఆర్థిక సాయం చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యాడు.