సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో కి జరిగిన తొక్కిసలాట ఘటనను ఎవరు మర్చిపోలేరు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీతేజ్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆరోజు నుంచి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తున్నారు. ప్రస్తుత అప్డేట్ ప్రకారం.. శ్రీ తేజ్ ఆరోగ్యం నిలగడగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని బులిటెన్‌లో పేర్కొన్నారు. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని, కళ్ళు తెరుస్తున్నాడని కిమ్స్ వైద్యులు తెలిపారు. కాకుంటే శ్రీ తేజ్ నార్మల్ కావడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే శ్రీతేజ్ వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ టీం భరిస్తుంది. ఇక తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణ పోలీసులు సైతం అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి 14 రోజులపాటు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ తిరిగి తన నివాసానికి చేరకున్నాడు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట..ఇప్పుడు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉందంటే?
- Advertisement -
- Advertisement -
- Advertisement -