Thursday, December 26, 2024

‘శ్రీవల్లి’ వీడియో సాంగ్ వచ్చేసింది…

- Advertisement -
- Advertisement -

Srivalli Video Song Released from Pushpa

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో బన్నీ సరసన యంగ్ బ్యూటీ రష్మికా మందాన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి.  కాగా, ఈ మూవీలోని ఒక్కో వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ‘దాక్కో దాక్కో మేక’ అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘శ్రీవల్లీ’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ రచయిత చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, సింగర్ సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాట సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా, డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ ఎవరూ ఊహించని వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

Srivalli Video Song Released from Pushpa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News