- Advertisement -
హైదరాబాద్: దేశ విదేశాల నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లను టిటిడి జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16వ తేదీ శనివారం నుండి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేస్తారు.
ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్‌లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.
- Advertisement -