తిరుపతి: ఆలయాల నిర్మాణమునకు, దళారీ వ్యవస్థను అరికట్టడానికి శ్రీవాణి ట్రస్ట్‌లో దర్శన విధానాన్ని ప్రారంభించామని టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. 70 మంది దళారీలను అరెస్ట్ చేయడంతో పాటు 214 కేసులు నమోదు చేశామని వివరించారు. శ్రీవాణి ట్రస్ట్‌కి భక్తులు ఇచ్చిన విరాళాలకు టికెట్లతో పాటు రసీదు ఇస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌కి ఇప్పటి వరకు రూ.861 కోట్ల విరాళాలు అందించామన్నారు.
Also Read: అమరుల నిత్యస్మరణకే..అమర జ్యోతి
రూ.603 కోట్లు బ్యాంకులో డిపాజిట్లు చేయ్యగా పలు బ్యాంకుల అకౌంట్లలో రూ.139 కోట్లు నిధులు వచ్చాయన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్లు వడ్డీ చేస్తామన్నారు. ఆలయాల నిర్మాణానికి రూ. 120 కోట్లు వ్యయం చేశామన్నారు. ఎపి, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరిలోని 127 పురాతన ఆలయాల పున:నిర్మాణం చేశామన్నారు. వీటికి రూ.139 కోట్లు కేటాయింపులు చేశామన్నారు. 2273 ఆలయాలు, గోశాలలు, భజన మందిరాల నిర్మాణానికి రూ.227 కోట్లు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1953 ఆలయాలు, సమ్రస్తా ఫౌండేషన్ ద్వారా 320 ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు.