Thursday, January 23, 2025

వాహన సేవలు 2 లక్షల మంది వీక్షించేలా చర్యలు: టిటిడి

- Advertisement -
- Advertisement -

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టిటిడి ఇఒ ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 15 నుంచి 23 వరకు సిఫార్సు లేఖలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3500 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గరుడ వాహనసేవకు అదనపు భద్రత కల్పిస్తామని, భక్తులందరికీ గరుడోత్సవం దర్శనానికి టిటిడి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. రెండు లక్షల మంది గ్యాలరీలో వాహన సేవలు వీక్షించేలా చర్యలు తీసుకుంటాం, నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, వాహన సేవలు ఊరేగింపు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుందని ధర్మారెడ్డి చెప్పారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవానికి బదులుగా బంగారు తేరు నిర్వహిస్తామని వెల్లడించారు. ధ్వజారోహణ, ధ్వజా అవరోహణ ఉండదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News