Monday, December 23, 2024

అయోధ్యలో శ్రీవారి లడ్డూలు!

- Advertisement -
- Advertisement -

అయోధ్య రామాలయంలో జనవరి 22న అంగరంగవైభవంగా జరగనున్న విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కూడా తన వంతు సేవలను అందించేందుకు నడుం బిగించింది. అయోధ్యలో శ్రీరాముడికోసం పాదుకలను హైదరాబాద్ కు చెందిన భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ కోటీ మూడు లక్షల రూపాయల ఖర్చుతో తయారు చేసి పంపించిన విషయం తెలిసిందే. అలాగే రామాలయ ద్వారాలు కూడా హైదరాబాద్ లోని అనూరాధ టింబర్ డిపోలో తయారయ్యాయి. ప్రతిష్ఠాత్మకంగా జరిగే రామజన్మభూమి పూజా కార్యక్రమాలలో టిటిడీ కూడా పాలుపంచుకుంటోందని, ఈ సందర్భంగా 25 గ్రాముల బరువుండే లక్ష శ్రీవారి లడ్డూలను పంపిణీ చేయాలని నిర్ణయించామని టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారి ధర్మారెడ్డి చెప్పారు.

ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద హిందూ ఆలయంగా రికార్డు నెలకొల్పనున్న అయోధ్య రామాలయాన్ని 2500 సంవత్సరాలపాటు నిలిచి ఉండేలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఏడువేల మంది ప్రముఖులు హాజరవుతున్నారు. వీరిలో రాజకీయవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అయోధ్య రామమందిరం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో సర్వాంగ సుందరంగా తయారైంది. రామాలయం మొత్తం మీద 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News