Monday, December 23, 2024

అయోధ్యకు శ్రీవారి లడ్డూ ప్రసాదం సిద్ధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.

ఇందుకోసం గురువారం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. ఈ లడ్డూలను అయోధ్యకు పంపనున్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శివ ప్రసాద్, పోటు ఏఈవో శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News