Wednesday, January 22, 2025

ఈనెల 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యా మాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుండి 12 గంటల వరకు జరుగుతుంది.

ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైశిష్ట్యం వివరాలు….
ఈనెల 14న అంకురార్పణం రాత్రి 7నుండి 9 గంటల వరకు, 15వ తేదీన బంగారు తిరుచ్చి ఉత్సవం ఉదయం గంటలకు, పెద్దశేషవాహనం రాత్రి 7గంటలకు , 16వ తేదీన చిన్నశేషవాహనం ఉదయం 8 గంటలకు, హంస వాహనం రాత్రి 7గంటలకు ,ఈనెల 17న సింహ వాహనం ఉదయం 8గంటలకు,ముత్యపు పందిరి వాహనం రాత్రి 7 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 18న కల్పవృక్ష వాహనం ఉదయం 8గంటలకు, సర్వభూపాల వాహనం రాత్రి 7 గంటలకు, ఈనెల 19న మోహినీ అవతారం ఉదయం 8గంటలకు,గరుడ వాహనం రాత్రి 7గంటలకు, ఈనెల 20న హనుమంత వాహనం ఉదయం 8గంటలకు, పుష్పకవిమానం సాయంత్రం 4గంటలకు, గజవాహనం రాత్రి 7గంటలకు ఉంటుందన్నారు. ఈనెల 21 సూర్యప్రభ వాహనం ఉదయం 8 గంటలకు, చంద్రప్రభ వాహనం రాత్రి 7గంటలకు , 22వ తేదీన స్వర్ణరథం ఉదయం 7.15గంటలకు, అశ్వవాహనం రాత్రి 7గంటలకు, ఈనెల 23న చక్రస్నానం ఉదయం 6గంటలకు ఉంటుందని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News