Wednesday, January 22, 2025

తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు

- Advertisement -
- Advertisement -

మొద‌టిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.
ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఇఒ శ్రీ ఏవి ధర్మారెడ్డి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజిఓలు శ్రీ నంద కిషోర్, శ్రీ గిరిధర్ రావు, శ్రీ బాల్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఒ శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News