- Advertisement -
అమరావతి: తిరుమలలో రోజు రోజుకూ భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 58, 908 మంది భక్తులు దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు. తల నీలాలు 19,549 మంది భక్తులు సమర్పించారు. తిరుమలలో గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వివరించారు.
- Advertisement -