Sunday, December 22, 2024

ఎల్లుండి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో ఎల్లుండి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. జులైకు సంబంధించిన సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో టిటిడి విడుదల చేయనుంది. ఈ నెల 18ను ఉదయం పది గంటలకు ఆర్జిత సేవల లక్కీ డిప్‌కు అవకాశం ఇవ్వనుంది. ఈ నెల 20న ఉదయం పది గంటల వరకు లక్కీ డిప్ నమోదు ప్రక్రియ జరగనుంది. డిప్‌లో టికెట్లు పొందినవారు చెల్లింపులు చేసి ఖరారు చేసుకోవాలని టిటిడి సూచించింది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లతో పాటు వాటి దర్శన స్లాట్ కూడా విడుదల చేయనుంది. ఈ నెల 23న ఉదయం పది గంటల నుంచి శ్రీవారి అంగ ప్రదిక్షణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాని ట్రస్టు టికెట్లు విడుదల చేయనుంది. ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల టోకెన్లు విడుదల చేయనుంది. ఈ నెల 24న ఉదయం పది గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News