Wednesday, January 22, 2025

తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్..

- Advertisement -
- Advertisement -

తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్‌ను టిటిడి జెఇవో వీరబ్రహ్మం ప్రారంభించారు. దీంతో శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్టు ఆఫ్‌లైన్ టికెట్లను ఎయిర్‌పోర్టు నుంచే దేశ విదేశీ భక్తులు పొందవచ్చు. ఈ సందర్భంగా వీరబ్రహ్మం మాట్లాడుతూ.. ఇంతకుముందు శ్రీవాణి ట్రస్టుకు రూ. 10 వేల విరాళం ఇచ్చి, టికెట్ కోసం రూ. 500 చెల్లించే వారికి తిరుమలలో ఆఫ్‌లైన్ టికెట్లను అందజేసేవారమని ఆయన తెలిపారు. తాజాగా దేశ, విదేశీ భక్తుల కోసం తిరుపతి ఎయిర్‌పోర్టులోనే శ్రీవాణి టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

ఇప్పటికే తిరుపతిలోని మాధవం గెస్ట్‌హౌస్‌లో శ్రీవాణి టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. తాజాగా ఎయిర్‌పోర్టుతో పాటు మాధవం గెస్ట్‌హౌస్‌లో కౌంటర్లను ఏర్పాటు చేయడం వలన టికెట్లు పొందే భక్తులు ఒకరోజు ముందుగా వచ్చి అవసరమైన పత్రాలను సమర్పించే శ్రమ తగ్గిందన్నారు. ఈ క్రమంలో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో వారికి వసతి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కౌంటర్ల నిర్వణనకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ముందుకు వచ్చిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News