Monday, December 23, 2024

మేనకోడలితో భర్త శృంగారం… కత్తిరించి పారేసిన భార్య!

- Advertisement -
- Advertisement -

పదిహేనేళ్ల తన మేనకోడలిని భర్త ముగ్గులోకి దించి, ఆమెతో సెక్స్ చేయడాన్ని భార్య తట్టుకోలేక, ఎవరూ చేయని పని చేసింది. బ్రెజిల్ లోని సావ్ పాలోకు సమీపంలోని అటిబాయలో జరిగిన ఈ సంఘటన కలకలం రేకెత్తించింది.

39 ఏళ్ల వ్యక్తి తన భార్య మేనకోడలికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొంతకాలంగా ఆమెతో శృంగారం జరుపుతున్నాడు. అతని భార్య ఇది పసిగట్టింది. ఒక రోజు భర్తతో ప్రేమగా మాట్లాడుతూ, అతన్ని మంచం మీదకు తీసుకొచ్చింది. అతనితో సెక్స్ చేసే ఉద్దేశం ఉన్నదానిలా నటిస్తూ, వెంట తెచ్చుకున్న రేజర్ తో ఒక్కసారిగా అతని పురుషాంగాన్ని కోసేసింది. అంతటితో ఆగకుండా దాన్ని టాయ్ లెట్ లో వేసి ఫ్లష్ చేసేసింది.

ఆ తర్వాత తన సోదరుడిని వెంటబెట్టుకుని పోలీసు స్టేషన్ కి వెళ్లి “హలో సార్, నా పేరు ఫలానా. నేను నా భర్త పురుషాంగాన్ని కోసేశాను” అంటూ తనను తాను పరిచయం చేసుకుని, లొంగిపోయింది. అంతేకాదు, ఇలా తెగిపడిన పురుషాంగాన్ని మళ్లీ అతికించవచ్చని ఎక్కడో చదివాననీ, అలా జరగకుండా ఉండేందుకే దానిని టాయ్ లెట్లో పడేసి ఫ్లష్ చేసేశానని కూడా చెప్పింది.

ఆమె మాటలకు పోలీసులు నిశ్చేష్టులైపోయారు. ఆమెను అదుపులోకి తీసుకుని, ఆమె భర్తను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఎలా ఉందో తెలియరాలేదు. భర్త పురుషాంగాన్ని కోసిన ఆ మహిళపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం గమనార్హం.

బ్రెజిల్ లో యువతీ యువకులకు 14 ఏళ్లు నిండితే ఇష్టపూర్వకంగా సెక్స్ లో పాల్గొనవచ్చు. సదరు మహిళ భర్తతో ఆమె మేనకోడలు ఇష్టపూర్వకంగా శృంగారం జరిపిందా లేదా అనే విషయాన్ని కనుగొనే ప్రయత్నలో పోలీసులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News