Wednesday, January 22, 2025

మహేష్ బాబుతో ‘గ్లోబల్ అడ్వెంచర్’: కన్ఫామ్ చేసిన జక్కన్న

- Advertisement -
- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ సినిమా గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రూమర్ వైరల్ అవుతోంది. మార్చిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ముహూర్తం కుదిరిందని టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరి మార్చి నుంచి మహేష్… రాజమౌళి సినిమాకి డేట్లు ఇస్తాడా? చూడాలి.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. కాకపోతే.. ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథలో కథానాయకగా దీపికా పడుకోణె అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే రాజమౌళి తాజాగా విదేశీ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందనుందని చెప్పారు. ఇక విజయేంద్రప్రసాద్… మహేశ్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని సమాచారం. నిజంగానే మహేష్, – రాజమౌళి కలయికలో ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ వస్తే ఖచ్చితంగా అది అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News