Monday, December 23, 2024

‘హీరో’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీ ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గల్లా పద్మావతి నిర్మించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 15న విడుదల కాబోతోంది.

SS Rajamouli launches HERO Movie Trailer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News