Monday, December 23, 2024

బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్న ఎస్ఎస్ రాజమౌళి (వీడియో)

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు లభిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ అద్భుత నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకుగాను రాజమౌళి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్’ అవార్డుకు ఎంపికయ్యారు. నిన్న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఆయన లాల్చీపైజామా ధరించాడు. ఆయన తన సతీమణి రమా రాజమౌళి, కుమారుడు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో రాజమౌళి అవార్డును అందుకోవడం చూడవచ్చు. రాజమౌళి హిస్టారికల్ డ్రామా RRR విడుదలై ఒక సంవత్సరం కావోస్తున్న ఈ చిత్రంపై రెస్పాన్స్ విపరీతంగా కొనసాగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News