Monday, December 23, 2024

తీపి కబురు చెప్పిన రాజమౌళి

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా చిత్ర దర్శకుడు రాజమౌళి తీపి కబురు చెప్పారు. మహేశ్ బాబుతో తలపెట్టిన మూవీ త్వరలో షూటింగ్ మొదలవుతుందన్నారు. జపాన్ లో రికార్డులు సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అక్కడి ప్రేక్షకులతో కలసి చూసేందుకు రాజమౌళి జపాన్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. జపాన్ లో రాజమౌళికి చక్కటి ఆదరణ లభిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ చాలా బాగుందంటూ అనేకమంది సినీ అభిమానులు థియేటర్ల వద్ద ఆయనతో కలసి సెల్ఫీలు దిగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News