Wednesday, January 22, 2025

మార్చి 18 నుంచి పది పరీక్షలు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: మార్చి,18 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారిణి రే ణుకాదేవి ఒక పకటనలో తెలిపారు. 18 రోజున ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, 19 రోజున సెకండ్ లాంగ్వేజ్ హిందీ 21 రోజున థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, 23 రోజున గణితం తేదీ 26 రోజున సైన్స్ మొదటి పేపర్ ఫిజికల్ సైన్స్, 28 రోజున సైన్స్ సెకండ్ పేపర్ బయోలాజికల్ సైన్స్, 30 రోజున సాంఘిక శాస్త్రం, ఏప్రిల్,1 రోజున ఓ ఎస్ ఎస్ సి మెయిన్ పేపర్ లాంగ్వేజ్ పేపర్ 1ఒకేషనల్ థియరీ పరీక్షలు, తేదీ 2 రోజున ఓఎస్‌ఎస్సి మెయిన్ పేపర్ లాంగ్వేజ్ సెకండ్ పరీక్షలు జరుగుతాయి. సైన్స్ మొదటి పేపరు అనగా ఫిజికల్ సైన్స్ ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు జరుగుతుందని,

సైన్స్ సెకండ్ పేపర్ అనగా బయోలాజికల్ సైన్స్ ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు జరుగుతుందని మిగతా అన్ని పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయన్నారు. ఈ సంవత్సరం కొత్తగా సైన్స్ సబ్జెక్టు కొరకు రెండు రోజులు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సైన్స్ మొదటి పేపర్ ఒక రోజున రెండో పేపరు ఒక రోజున నిర్వహించడం జరుగుతుందని, ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరూ గమనించవలసినదిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి జి. రేణుకదేవి తెలియజేశారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహి ంచడం జరుగుతుందని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News