- Advertisement -
అమరావతి: 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బోత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణీలయ్యారు. ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. 78.3శాతంతో ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండగా 49.7శాతం ఉత్తీర్ణతతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో ఉంది. 797 స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని స్కూళ్లు 71 ఉన్నాయి. రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.
- Advertisement -