మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 91.30 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలు 93.23 శాతం, బాలుర్లు 89.42 శాతం ఉతీర్ణత శాతంతో అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు. 99.09 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానం, 98.65 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట రెండో స్థానం. 98.27 శాతం ఉత్తీర్ణతతో సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో ఉంది. వికారాబాద్ జిల్లా 65.10 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలన్నీ ప్రైవేట్‌వేనని బుర్రా వెంకటేశం చెప్పారు.
,
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి