- Advertisement -
బాపట్ల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. పర్చూరు మండలం అడుసుమల్లిలో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచార మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పదో తరగతి చదువుతున్న సందీప్ అనే విద్యార్థి రెండు రోజుల క్రితం కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సందీప్ మృతదేహం అడుసుమల్లి సమీపంలోని కాల్వలో లభ్యం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పర్చూరు పోలీసులు.
- Advertisement -