Wednesday, January 22, 2025

దొంగతనం కేసులో ఎస్సై…? 

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: దొంగతనం కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఓ ఎస్సై ఇరుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం…ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ శామ్యుల్ కుటుంబంతో పాటు ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన భూమి కొనుగోలు చేస్తానని చెప్పి దుండిగల్‌కు చెందిన సురేందర్ కలిశాడు. శామ్యుల్ ఇంటికి వెళ్లిన సురేందర్ మత్తుమందు కలిపిన ఇడ్లీ, కొబ్బరి నీళ్లు తీసుకుని వెళ్లాడు. ఇడ్లీ తిని కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శామ్యూల్ స్పృహతప్పి కిందపడిపోయాడు. దీంతో సురేందర్ ఇంట్లోని రూ.5లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి తీసుకుని పారిపోయాడు.

కొద్ది సేపటి తర్వాత శామ్యూల్‌కు స్పృహ రావడంతో సురేందర్ దొంగతనం చేసిన విషయం గ్రహించాడు. వెంటనే ఈ నెల 14వ తేదీన ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమో దు చేసుకున్న పోలీసులు సురేందర్‌ను అరెస్టు చేసి విచారించారు. పోలీసుల విచారణలో తను దొంగిలించిన భూమి పత్రాలను దుండిగల్ ఎస్సై కృష్ణ వద్ద దాచినట్లు చెప్పాడు. దీంతో ముషీరాబాద్ ఎస్సై కృష్ణను విచారించగా తనకు భూమిపత్రాలు ఇవ్వలేదని బుకాయించాడు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ వచ్చిన ముషీరాబాద్ పోలీసులు భూమి పత్రాలు ఇచ్చినట్లు తమ వద్ద సాక్షాలు ఉన్నాయని చెప్పడంతో వారిని నగర శివారులోకి తీసుకుని వెళ్లి పత్రాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఎస్సై పాత్రపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News