Thursday, December 26, 2024

ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి2 ప్రయోగం విజయవంతం

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి2 ప్రయోగం విజయవంతమైంది. భారత్‌కు చెందిన రెండు ఉపగ్రహాలు కక్షలోకి చేరుకున్నాయి. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకుంది. ఇఒఓస్-07, జానుస్-1, ఆజాదీ శాట్‌ను ఇస్రో కక్ష్య లోకి ఇస్రో ప్రవేశపెట్టింది. ఎస్‌ఎస్‌ఎల్‌వి డి1 175.2 కేజీల బరువును మోసుకెళ్లింది. ఇఒఎస్ 07-156.3 కేజీలు, జానుస్ 10.2 కేజీలు, అజాదీ శాట్2- 8.7 కేజీలు బరువు కలిగి ఉన్నాయి. 450 కిలో మీటర్ల దూరంలో ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఎస్‌ఎస్‌ఎల్‌వి ఉప్రగ్రహం పొడవు 34 మీటర్లు, రెండు మీటర్ల వ్యాసం ఉంది. ఈ ఉపగ్రహానికి రూ.56 కోట్లు ఖర్చు చేసినట్టు ఇస్రో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News