Monday, December 23, 2024

మహేశ్ 28వ సినిమా ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

SSMB28 Movie launched in Hyderabad

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడో చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ భార్య నమ్రత, హీరోయిన్ పూజా హెగ్డే, త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, తదితరులు పాల్గొన్నారు. మహేష్ 28వ చిత్రంగా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభంచనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల కానుంది.

SSMB28 Movie launched in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News