Thursday, December 26, 2024

‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ షూటింగ్ షురూ

- Advertisement -
- Advertisement -

#SSMB28 Movie Shoot Begin

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. సోమవారం ఫార్మల్‌గా షూటింగ్‌ని ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ప్రారంభించి మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని నిరాటంకంగా కొనసాగించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో హీరో మహేష్ బాబుపైనే ప్రధానంగా చిత్రీకరించనున్నారు త్రివిక్రమ్. ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వారిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా సెట్స్‌పైకి వచ్చింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్. ప్రకాష్ నేతృత్వంలో భారీ సెట్‌ని నిర్మించారు. ఈ సెట్‌లో మహేష్, కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు. కీలక షూటింగ్‌ని మంగళవారం నుంచి త్రివిక్రమ్ ప్రారంభించబోతున్నారు. బస్సు నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎపిసోడ్ ని దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరించనున్నారట.

#SSMB28 Movie Shoot Begin

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News