Monday, December 23, 2024

క్రేజీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ.. ప్రచార చిత్రం విడుదల

- Advertisement -
- Advertisement -

SSMB28 Movie Shoot will begin in August

సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న భారీ, ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభమవుతోంది. ఈ చిత్రంలో మహేష్ సరసన అందాల తార పూజాహెగ్డే మరోసారి జతకడుతున్నారు. మహేష్, త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే… జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్.ప్రకాష్, ఛాయాగ్రాహకుడుగా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం అవగతమవుతుంది. ఇక వచ్చే ఏడాది వేసవిలో చిత్రం విడుదలవుతుంది.

SSMB28 Movie Shoot will begin in August

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News