Thursday, January 23, 2025

‘ఎస్‌ఎస్‌ఎంబి29’ మూవీకి టైటిల్ ఫిక్స్.. సోషల్ మీడియాలో చక్కర్లు

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తన గత చిత్రం గుంటూరు కారంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. తదుపరి దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఒక అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. మహేష్ బాబు ఈ చిత్రం కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. అందులో మహేష్ బాబు గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపించనున్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇంకా షూటింగ్ మొదలు పెట్టని ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎంబి29’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన హింట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విజువల్ డెవలప్ మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ ఇందుకు కారణం అయింది. బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను తన ఇన్ స్టా స్టోరీస్‌లో ఉంచి ‘#ఎస్‌ఎస్‌ఎంబి29’, ‘#ఎస్‌ఎస్‌ఎంబి29 డైరీస్’ అని పేర్కొన్నాడు. దీంతో మహేశ్ బాబు కొత్త సినిమాకు గరుడ అనే టైటిల్ పెట్టనున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.

అయితే ఈ గరుడ ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. గతంలో రాజమౌళినే స్వయంగా దీన్ని ప్రకటించాడు. బాహుబలి మూవీ తర్వాత తాను చేయబోయే ప్రాజెక్టు అదేనని కూడా ఆయన తెలిపాడు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అప్పుడు రాజమౌళి మనసులో ఉన్న గరుడ ఇదేనా? కాదా? అన్నదానిపై క్లారిటీ లేదు. కాగా, విజయన్ పోస్టుతో గరుడ మళ్లీ వార్తల్లోకి రాగా దీనిపై చిత్ర బృందం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News