Saturday, January 4, 2025

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. రాజమౌళి, మహేశ్‌ మూవీ కాంబోలో తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబి29 సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని ఎంతగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే, ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. తాజాగా ఈ సినిమాపై అప్డేట్ వచ్చేసింది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో ఈ సినిమా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్రయూనిట్ పూజా కార్యక్రమాలతో ఈ మూవీని ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల గురించి వివరాలు  వెల్లడించే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇండియన్ సినిమా చరిత్రలో ఈ మూవీ సరికొత్త రికార్డు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News