Monday, December 23, 2024

గిరిజన ఎంఎల్ఎను డిప్యూటీ సిఎం చేశా: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: రాజకీయ పదవుల్లో గిరిజనులకు పాధాన్యత ఇచ్చామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర గిరిజన యూనివర్సిటీని సిఎం జగన్ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన ఎంఎల్‌ఎను డిప్యూటీ సిఎంను చేశానని, ప్రతి పథకం గిరిజనులకు వర్తింపచేసేలా చర్యలు తీసుకున్నామని సిఎం జగన్ పేర్కొన్నారు. ఎపిలో ఇది రెండో సెంట్రల్ యూనివర్సిటీ అని, ఆర్థికంగా, సామాజికంగా గిరిజనులను ఆదుకుంటున్నామని, గిరిజనులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.

దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశామని, పాడేరులో మెడికల్ కాలేజీ రాబోతోందని, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ రాబోతుందని, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నామని, గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామని, గిరిజనులకు ప్రత్యేక జిల్లా, వర్సిటీ ఇస్తామని సిఎం జగన్ వెల్లడించారు. గిరిజనులకు ఏకంగా రెండు జిల్లాలు ఇచ్చామని, గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు , ప్రత్యేక ఎస్‌టి కమిషన్ ఏర్పాటు చేశామని వివరించారు. ఏజెన్సీల్లో 497 సచివాలయాల్లో వాలంటీర్లంతా గిరిజనులేనని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News