ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో డేటాసెంటర్ ఏర్పాటు ఇప్పటికే
హైటెక్‌సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తున్న సంస్థ మంత్రి శ్రీధర్‌బాబు
సమక్షంలో ఎంఓయులపై సంతకాలు ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం
చేసిన సిఎం రేవంత్‌రెడ్డి డేటా సెంటర్లకు హైదరాబాద్ రాజధానిగా
అవతరించనున్నదని అభివర్ణన సింగపూర్‌లో సిఎం బృందం రెండో
రోజు పర్యటనలో భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం
ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో
డేటా సెంటర్ ఏర్పాటు
ఇప్పటికే హైటెక్ సిటిలో డేటా సెంటర్
నిర్వహిస్తున్న సంస్థ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎసిటి టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజూ సింగపూర్ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. సిఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సింగపూర్‌లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో
పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్‌టిటి గ్రూప్ సీఈఓ బ్రూనో లోపెజ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఆధునిక అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్‌ను ఈ కంపెనీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దాదాపు రూ. 3,500 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆ కంపెనీ ముందుకురావటం తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలను, ప్రపంచస్థాయి అనుకూలతలను చాటి చెప్పింది.
కంపెనీ ప్రతినిధులను అభినందించిన సిఎం
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని ఆయన అన్నా రు. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు. తెలంగాణతో కలిసి పని చేయటం గౌరవంగా ఉందని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈఓ బ్రూనో లోపెజ్ అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహాకరంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్ నిర్మించాలన్న ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.
ప్రపంచానికి హైదరాబాద్ డేట్ హబ్‌గా మారుతుందని మంత్రి శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కంపెనీ పదేళ్లలో మన దేశంలో ఒక గిగావాట్ సామర్దానికి విస్తరించాలన్న లక్షంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది.